నాన్నా ....
కన్నమ్మా ....
బుజ్జి నాన్నా....
బంగారు తండ్రీ....
ఎన్ని పేరులో ఎన్ని పిలుపులో
అయినా ఇంకా పిలవాలనే ఉంటుంది
మీ చిన్నమ్మ కి, ఏ కారణం లేకున్నా.
చిన్నమ్మ కి అమ్మవి అయ్యావు
చిన్నమ్మా అంటూ బిడ్డ గా చెంత కి వచ్చావు
వరుసకేమో తమ్ముడివి
తండ్రి లా కంటి కి రెప్పలా కాపాడతావు
అమ్మా, నాన్నా, కొడుకు, తమ్ముడు, అన్ని వరసలు నువ్వే అయ్యావు
చిన్నమ్మ బాధపడితే నీ కంట నీరు వస్తుంది
చిన్నమ్మ కి దెబ్బ తగిలితే నీకు వాత మిగులుతుంది
చిన్నమ్మ మాట్లాడలేదని మనసు కష్టపెట్టుకున్నావు
కానీ, ఒక సారి చిన్నమ్మని ఆ క్షణం లో చూసావా
నీ కంట నీరు చుస్తే తను ఇంకా కుంగిపోతుంది
నీకు దెబ్బ తగిలినప్పుడు తన ప్రాణం విలవిలలాడుతుంది
నీతో మాట్లాడకపోతే తను ఉండగలదా కన్నా
పరిస్థితులు తెలిసిన నువ్వే తనని అర్థం చేసుకోకపోతే ఎలాగ నాన్నా
నీ చిన్నమ్మ పేరాలు పేరాలు రాసేదన్నావు
ఇప్పుడు రాయటం మానేసిందని బాధ పడ్డావు
కారణం ప్రేమ తగ్గిపోయి కాదు
నీ గురించి ఎంత రాసినా తక్కువే కన్నా
మాటల్లో చెప్పుకోలేని ప్రేమ
పదాలే దొరకని ఆత్మీయం
ఎలా చెప్పాలో తెలియక
"కన్నమ్మా" అన్న పిలుపుతోనే ఆనందిస్తోంది
ఆ పిలుపులోనే తన ప్రాణం పెట్టుకుంది
చిన్నమ్మ నవ్వు లోని జీవం, నీ సంతోషంలో ఉంది నాన్నా.